Gujarat: వడోదర వరదల్లో కొట్టుకొచ్చిన 52 మొసళ్లు.. రక్షించిన అధికారులు

  • ఈ నెల మొదట్లో గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు
  • చెరువులు, కాలువల ద్వారా కొట్టుకొచ్చిన మొసళ్లు
  • రక్షించి విశ్వామిత్రి నదిలో వదిలిన అధికారులు

గుజరాత్‌లోని వడోదరలో వరదల్లో కొట్టుకొచ్చిన 52 మొసళ్లను అటవీ, వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు రక్షించారు. ఇటీవల సంభవించిన వరదల్లో పెద్ద ఎత్తున మొసళ్లు కొట్టుకు వచ్చాయి. సమాచారం అందుకున్న అధికారులు వాటిని రక్షించి సురక్షితంగా వదిలిపెట్టారు. వరదల కారణంగా నీటి స్థాయులు పెరిగిపోవడంతో కాలువలు, చెరువుల్లోకి మొసళ్లు కొట్టుకువచ్చినట్టు వడోదర ఫారెస్ట్ రేంజ్ అధికారి నిధి దవే తెలిపారు. రక్షించిన మొసళ్లను విశ్వామిత్రి నదిలో వదిలిపెట్టామని, వాటి నివాసం అదేనని ఆయన పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం వడోదరలోని కారెలిబాగ్‌లో 16 అడుగుల పొడవున్న భారీ మొసలిని అధికారులు పట్టుకున్నారు. కాగా, ఈ నెల మొదట్లో గుజరాత్‌లో వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా కాలువలు, చెరువులు, నదులు పొంగిపొర్లాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

More Telugu News