Anna Canteen: పేదలంటే మీకు, మీ ప్రభుత్వానికి ఇంత అసహ్యమా?: విజయసాయిరెడ్డిపై వర్ల ఫైర్

  • పేదలు సోమరిపోతుల్లా కనిపిస్తున్నారా? 
  • అన్న క్యాంటీన్లలో తిని సోమరిపోతుల్లా తయారయ్యారని అంటారా?
  • పేదలంటే మీకు, మీ ప్రభుత్వానికి ఇంత అసహ్యమా?
ఏపీలో అన్న క్యాంటీన్లు మూసివేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూసివేయడం తగదంటూ వైసీపీ ప్రభుత్వంపై వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘పేదలు సోమరిపోతుల్లా కనిపిస్తున్నారా? అన్న క్యాంటీన్లలో తిని పేదలు సోమరిపోతుల్లా తయారయ్యారని అంటారా? పేదలను కించపరుస్తారా? పేదలంటే మీకు, మీ ప్రభుత్వానికి ఇంత అసహ్యమా?’ అంటూ ఓ ట్వీట్ లో ప్రశ్నల వర్షం కురిపించారు.
Anna Canteen
Mp
Vijayasai
Varla
AP

More Telugu News