Pakistan: పాక్ కుతంత్రం.. హెచ్చరించకుండా సట్లెజ్ నది గేట్లు ఎత్తివేత!

  • సట్లెజ్ నదిపై ఉన్న హెడ్‌వర్క్స్ గేట్లను ఒక్కసారిగా ఎత్తిన పాక్
  • నీట మునిగిన 17 భారత గ్రామాలు
  • కాసూర్‌లోని తోళ్ల పరిశ్రమ వ్యర్థాలు కూడా భారత్‌లోకి..

దాయాది దేశం పాక్ కుళ్లుబుద్ధి మరోమారు బయటపడింది. ఎటువంటి హెచ్చరికలు లేకుండానే కసూర్‌లో సట్లెజ్ నదిపై ఉన్న హెడ్‌వర్క్స్ గేట్లను ఎత్తివేసింది. ఫలితంగా పంజాబ్ సరిహద్దులోని 17 గ్రామాలు నీట మునిగాయి. ఈ నీటితోపాటు కసూర్‌లోని తోళ్ల పరిశ్రమల కాలుష్యాన్ని కూడా భారత్‌లోకి విడిచిపెట్టి తన వక్రబుద్ధిని చాటుకుంది. పాక్ విడిచిపెట్టిన తోళ్ల పరిశ్రమ వ్యర్థాల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ చందర్ గైండ్ పేర్కొన్నారు.

మరోవైపు, ఆప్ఘనిస్థాన్‌లో ఉన్న వందమంది కరుడుగట్టిన ఉగ్రవాదులను కశ్మీర్‌కు పంపి అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్న విషయాన్ని భారత నిఘా వర్గాలు పసిగట్టి అప్రమత్తం చేశాయి. అలాగే, భారత సరిహద్దు వద్ద చొరబాట్లకు రెడీగా కొందరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు కాచుక్కూర్చున్నారని కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో నియంత్రణ రేఖ వెంబడి భారత దళాలు గస్తీని ముమ్మరం చేశాయి.

More Telugu News