Telangana: కొనసాగుతున్న అల్పపీడనం.. తెలంగాణలో రేపటి వరకు వర్షాలు

  • ఉపరితల ఆవర్తన ప్రభావంతో తిరుమలలో వర్షాలు
  • నిన్న సాయంత్రం నుంచి తెలంగాణలో వర్షాలు
  • ఈశాన్య మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం
ఈశాన్య మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా కొన్ని రోజులుగా తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది.

Telangana
rains
imd
Hyderabad

More Telugu News