Jagan: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ప్రభుత్వ సలహాదారుగా దేవులపల్లి అమర్

  • జర్నలిజంలో అమర్‌కు అపార అనుభవం
  • ప్రస్తుతం సాక్షి టీవీలో కన్సల్టింగ్ ఎడిటర్‌గా ఉన్న అమర్
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నియమాకం చేపట్టింది. ప్రముఖ పాత్రికేయుడు దేవులపల్లి అమర్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పాత్రికేయ వృత్తిలో ఆయనకు ఉన్న అపార అనుభవాన్ని వినియోగించుకోవాలని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఎంపికైన అమర్ జాతీయ మీడియా, పొరుగు రాష్ట్రాలతో సంబంధాల విషయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించనున్నారు.  

ప్రస్తుతం సాక్షి టీవీలో కన్సల్టింగ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న అమర్.. 1976లో ఈనాడు దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. రెండుసార్లు ఉమ్మడి ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా, ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌(ఐజేయూ) అధ్యక్షుడిగా పనిచేశారు.
Jagan
Andhra Pradesh
devulapalli amar

More Telugu News