Assembly: ఏపీ శాసనసభ చీఫ్ మార్షల్ గణేశ్ బాబుపై బదిలీ వేటు!

  • అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు వ్యవహారం.. 
  • చీఫ్ మార్షల్ పదవి నుంచి గణేశ్ బాబు తొలగింపు
  • ‘మాతృశాఖ ఆక్టోపస్’ కు పంపుతూ ఉత్తర్వులు

గతంలో ఏపీ అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు వ్యవహారానికి సంబంధించి శాసనసభ చీఫ్ మార్షల్ గణేశ్ బాబుపై ప్రభుత్వం వేటు వేసింది. ఆ పదవి నుంచి ఆయన్ని తప్పించింది. ఈ మేరకు డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి రానున్నాయి. గణేశ్ బాబును తన మాతృశాఖ ‘ఆక్టోపస్’ కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంగళగిరిలోని కార్యాలయంలో ఆక్టోపస్ ఎస్పీకి రిపోర్టు చేయాలని ఆయనకు ఆదేశాలు అందాయి. కాగా, ‘ఆక్టోపస్’ లో అసిస్టెంట్ కమాండెంట్ గా గణేశ్ బాబు ఉన్నారు.

  • Loading...

More Telugu News