Raj Tarun: రాజ్ తరుణ్ మద్యం సేవించలేదు... కార్తీక్ ఓ బ్లాక్ మెయిలర్: రాజా రవీంద్ర

  • రాజ్ తరుణ్ కారు ప్రమాదం వ్యవహారంలో మరో ట్విస్ట్
  • తమను కార్తీక్ రూ.5 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపిన రాజా రవీంద్ర
  • వీడియో, ఆడియోలను మీడియాకు అందిస్తానని బెదిరించాడంటూ వెల్లడి
టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదం వ్యవహారం మరో మలుపు తిరిగింది. తాను రాజ్ తరుణ్ ను వెంబడించి పట్టుకున్నానని, కానీ అతని మేనేజర్, ప్రముఖ నటుడు రాజా రవీంద్ర తనను బెదిరింపులకు గురిచేశాడని కార్తీక్ అనే యువకుడు మీడియా ముందుకు రావడం తెలిసిందే. అయితే, కార్తీక్ ఓ బ్లాక్ మెయిలర్ అని, అతడు తమను రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని రాజా రవీంద్ర ఆరోపించారు.

 తాము అంగీకరించకపోయేసరికి కనీసం రూ.3 లక్షలైనా ఇవ్వాలని బెదిరించాడని వెల్లడించారు. అప్పటికీ తాము లొంగకపోయేసరికి ఆ వీడియో, ఆడియోలను మీడియాకు అందిస్తానని బెదిరించాడని రాజా రవీంద్ర ఆరోపించారు. అంతేకాకుండా, ప్రమాదం జరిగిన సమయంలో రాజ్ తరుణ్ మద్యం తాగి ఉన్నాడని కార్తీక్ చెబుతున్న దాంట్లో నిజంలేదని రాజా రవీంద్ర స్పష్టం చేశారు.
Raj Tarun
Raja Ravindra
Tollywood

More Telugu News