Congress: సొంత కూతురును హత్య చేయించిన మహిళ వాంగ్మూలం ఆధారంగా చిదంబరాన్ని అరెస్ట్ చేస్తారా?: రణదీప్ సుర్జేవాలా

  • చిదంబరాన్ని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసం
  • పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయింది
  • పన్నెండేళ్ల తర్వాత చిదంబరంను అరెస్టు చేశారు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ‘కాంగ్రెస్’ సీనియర్ నేత చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ, సొంత కూతురును హత్య చేయించిన కేసులో జైలులో ఉన్న ఓ మహిళ వాంగ్మూలం ఆధారంగా నలభై ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న నేత చిదంబరంను అరెస్ట్ చేశారని అంటూ, ఐఎన్ఎక్స్ అధినేత ఇంద్రాణీ ముఖర్జీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఓ నిందితురాలు చెప్పిన ఆధారాలతో చిదంబరాన్ని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కేసు 2007 సంవత్సరం నాటిదని, పన్నెండేళ్ల తర్వాత చిదంబరంను అరెస్టు చేశారని మండిపడ్డారు. ఎఫ్ఐబీపీ అనుమతులు ఇచ్చిన వారిని కానీ, నేరానికి పాల్పడిన కంపెనీ అధికారులను కానీ అరెస్టు చేయలేదని విమర్శించారు.
Congress
chidrambaram
spokes person
Randeep

More Telugu News