Andhra Pradesh: తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మార్గంలో మద్యం షాపులపై నిషేధం

  • ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ
  • అక్టోబర్ 1 నుంచి కొత్త విధానంలో మద్యం విక్రయాలు
  • బేవరెజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహణ
ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త విధానంలో మద్యం విక్రయాలను జరుగుతాయి. బేవరెజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 3,500 మద్యం షాపులను నిర్వహించనున్నారు. దశలవారీగా మద్యం నిసేధంలో భాగంగా షాపుల సంఖ్యను 800కు పైగా ప్రభుత్వం తగ్గించింది. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మార్గంలో మద్యం షాపులపై నిషేధం విధించింది. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
Andhra Pradesh
tirupathi
excise policy

More Telugu News