Alapati Raja: లేని అవినీతిని చంద్రబాబుపై రుద్దాలనే రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు: ఆలపాటి రాజా

  • ఏపీ సర్కారుపై మాజీ మంత్రి ధ్వజం
  • రివర్స్ టెండరింగ్ ప్రక్రియ రాష్ట్రానికి ఉపయోగపడే నిర్ణయం కాదంటూ వ్యాఖ్యలు
  • ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోలవరం పూర్తి చేసేందుకు టీడీపీ కృషి చేసిందని వెల్లడి
ఏపీ సర్కారుపై టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజక్టు విషయంలో లేని అవినీతిని చంద్రబాబుపై రుద్దేందుకే రివర్స్ టెండరింగ్ కు వెళ్లారని ఆరోపించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ఏ విధంగానూ రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే నిర్ణయం కాదని విమర్శించారు. గతంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాజక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతోనే టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని రాజా తెలిపారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతోనైనా జగన్ కళ్లు తెరవాలని హితవు పలికారు. పోలవరంలో ఎలాంటి అవినీతి జరగలేదని తాము బహిరంగ సవాల్ విసురుతున్నామని ఉద్ఘాటించారు.
Alapati Raja
Chandrababu
Andhra Pradesh
Jagan
YSRCP
Polavaram

More Telugu News