Chidambaram: చిదంబరం అరెస్ట్ పై మమత ఆవేదన

  • చిదంబరం ఒక సీనియర్ నాయకుడు
  • కేంద్ర హోంమంత్రిగా, ఆర్థికమంత్రిగా సేవలందించారు
  • ఆయనను అరెస్ట్ చేసిన విధానం బాధాకరం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేయడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. చిదంబరంను అరెస్ట్ చేసిన విధానం బాధాకరంగా ఉందని ఆమె అన్నారు. చిదంబరంకు సంబంధించిన లీగల్ అంశాల గురించి తాను మాట్లాడనని... అయితే, దేశంలోని సీనియర్ నాయకులలో ఆయన ఒకరని... దేశ ఆర్థికమంత్రిగా, హోంమంత్రిగా సేవలందించారని చెప్పారు. మరోవైపు, ఈరోజు చిదంబరంను మూడు గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కాసేపట్లో సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయనను ప్రవేశపెట్టనున్నారు.
Chidambaram
Mamata Banerjee
CBI
Arrest
Congress
TMC

More Telugu News