Andhra Pradesh: ఓ ఐపీఎస్ అధికారిపై చేయి చేసుకున్నావ్.. నువ్వూ మాట్లాడుతున్నావా కేశినేని?: వైసీపీ

  • జగన్ పై కేశినేని తుగ్లక్ వ్యాఖ్యలు
  • కేశినేని విమర్శలను తిప్పికొట్టిన వైసీపీ
  • తుగ్లక్, రౌడీలు టీడీపీలోనే ఉన్నారని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ గా మారకూడదని కోరుకుంటున్నట్లు టీడీపీ నేత కేశినేని నాని ఈరోజు చెప్పిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిని తరలిస్తారన్న వార్తల నేపథ్యంలో కేశినేని ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేశినేని కామెంట్లకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. తుగ్లక్ లు, రౌడీలంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని వైసీపీ విమర్శించింది.  

ఓ ఐపీఎస్ అధికారిపై చేయి చేసుకున్న కేశినేని, దాన్ని మర్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పచ్చ నేతలంతా భూములు కొన్నాకే అమరావతిలో రాజధానిని ప్రకటించారన్నది వాస్తవం కాదా? అని నిలదీసింది. గత ఐదేళ్ల కాలంలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు కేశినేని ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారని నిలదీసింది. ఈ మేరకు వైసీపీ ట్వీట్లు చేసింది.
Andhra Pradesh
Jagan
YSRCP
Twitter
Telugudesam
Kesineni Nani

More Telugu News