China: భారీ వరదలకు చైనా అతలాకుతలం.. 627 మంది గల్లంతు.. నిరాశ్రయులైన 7 కోట్ల మంది!

  • కుండపోత వర్షాలకు చిగురుటాకులా వణుకుతున్న చైనా
  • దాదాపు 30.5 బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం
  • ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
భారీ వరదలతో చైనా అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, కాలువలు వరద నీటితో పోటెత్తుతున్నాయి. వరదల కారణంగా జూన్ నుంచి ఇప్పటి వరకు 627 మంది గల్లంతయ్యాయని, 7.18 కోట్ల మంది నిరాశ్రయులయ్యారని చైనా అత్యవసర నిర్వహణ శాఖ ప్రకటించింది. గల్లంతైన వారిలో ఎక్కువ మంది చనిపోయి ఉండవచ్చని తెలిపింది. వరదల కారణంగా చైనాలో భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుంది. దాదాపు 30.5 బిలియన్ డాలర్ల మేర ఈ నష్టం ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని... అయితే, వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయని తెలిపారు.
China
Floods

More Telugu News