Andhra Pradesh: మేం వరద బాధితుల మధ్యలో ఉంటే.. మీరు హైదరాబాద్ లో పార్టీలు చేసుకుంటున్నారు!: టీడీపీకి వైసీపీ కౌంటర్

  • ఏపీలో వరదపై ట్వీట్ల యుద్ధం
  • జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీడీపీ
  • టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ట్విట్టర్ యుద్ధం నడుస్తోంది. వరద బాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కారు విఫలమైందని టీడీపీ పలుమార్లు విమర్శించగా, తాజాగా వైసీపీ దానికి కౌంటర్ ఇచ్చింది. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తమ మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారని వైసీపీ తెలిపింది. వరద బాధితులను కలుసుకుంటున్న వైసీపీ నేతలు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారని చెప్పింది.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ హైదరాబాద్ కు వెళ్లిపోయి పార్క్ హయత్ హోటల్ లో విందులు, వినోదాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టింది. జూనియర్ ఆర్టిస్టులతో షార్ట్ ఫిల్మ్ లు తీస్తూ అడ్డంగా దొరికిపోతున్నారని విమర్శించింది. ఈ మేరకు ట్వీట్ చేసిన వైసీపీ, వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన-హైదరాబాద్ లో చంద్రబాబు ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేసింది.
Andhra Pradesh
Telugudesam
YSRCP
Twitter
counter
Hyderabad
Telangana
minister
Floods
Party

More Telugu News