భారత్ పై మరోసారి విషం కక్కిన ఇమ్రాన్.. కశ్మీరీలను అణచివేస్తోందని ఆరోపణలు!
- భారత బలగాలు ప్రజలను అణచివేస్తున్నాయి
- స్వేచ్ఛగా బక్రీద్ ను కూడా జరుపుకోనివ్వడం లేదు
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన పాక్ ప్రధాని
నేడు మతం కారణంగా హింసకు గురైన బాధితుల దినోత్సవం నేపథ్యంలో లక్షలాది మంది కశ్మీరీలు భారత్ పాలనలో అణచివేతకు గురికావడంపై దృష్టి సారించాల్సిందిగా ప్రపంచదేశాలను ఇమ్రాన్ ఖాన్ కోరారు. భారత ప్రభుత్వం కశ్మీరీల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను నిరాకరిస్తోందనీ, తీవ్రమైన హింసకు పాల్పడుతోందని ఇమ్రాన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.