Sye Raa: కన్నడ రికార్డులను కూడా బద్దలు కొట్టిన 'సైరా'

  • 24 గంటల్లో 3.7 మిలియన్ల వ్యూస్ ను సాధించిన 'సైరా' టీజర్
  • గతంలో కిచ్చా సుదీప్ పేరిట ఉన్న రికార్డు
  • 24 గంటల్లో 2.4 మిలియన్ వ్యూస్ సాధించిన సుదీప్ చిత్రం 'పహిల్వాన్' టీజర్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'సైరా' మూవీ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ సంచలనాలను సృష్టిస్తోంది. తెలుగులో ఇప్పటికే 8.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ టీజర్... కన్నడనాట కూడా రికార్డులను బద్దలు కొడుతోంది. కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ నటించిన 'పహిల్వాన్' టీజర్ 24 గంటల్లో 2.4 మిలియన్ వ్యూస్ ను సాధించి ఇప్పటి వరకు తొలి స్థానంలో నిలించింది. 'సైరా' టీజర్ 24 గంటల్లో 3.7 మిలియన్ వ్యూస్ ను సాధించి సుదీప్ రికార్డును బద్దలు కొట్టింది. దీన్ని బట్టి చూస్తే కర్ణాటకలో ఈ సినిమా కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది.
Sye Raa
Chiranjeevi
Sudeep
Teaser
Record
Karnataka

More Telugu News