Ramgopal Varma: చిద్దూ అరెస్ట్ పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్!

  • నాడు సీబీఐ కార్యాలయాన్ని ప్రారంభించిన చిదంబరం
  • నేడు అదే కార్యాలయంలో కస్టడీలో
  • చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న వర్మ
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరంను నిన్న రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేయగా, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మోదీ ప్రభుత్వాన్ని పొగిడారు. చిదంబరం అరెస్ట్ ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం అని కితాబిచ్చారు. "చిదరంబరం అరెస్ట్ ప్రజాస్వామ్య ప్రతిరూపానికి ప్రతిరూపం. ఆయన అరెస్ట్‌ లో ఓ స్పెషల్ ఉంది. కేంద్ర హోమ్ మంత్రి హోదాలో సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించింది చిదంబరమే. ఇప్పుడు అదే కార్యాలయంలో ఆయన కస్టడీలో ఉన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని నరేంద్ర మోదీ ఇండియా మళ్లీ నిరూపిస్తోంది" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
Ramgopal Varma
Twitter
Chidambaram

More Telugu News