Fish: ఒక చేపకు రెండు నోర్లు... చూసి షాకవుతున్న ప్రపంచం!

  • మహిళ వలకు చిక్కిన చేప
  • చాంప్లెయిన్ సరస్సులో పెరిగిన చేప
  • నిమిషాల వ్యవధిలో వేల షేర్లు

ఈ చిత్రం ఇప్పుడు ఆన్ లైన్ లో సంచలనం కలిగిస్తూ వైరల్ అవుతోంది. జన్యులోపాల పరంగా అదనపు కాళ్లు, చేతులు, రెండు తలలు... ఇలా లోపాలతో పుట్టిన ఎంతో మందిని, ఎన్నో జంతువులను మనం చూశాం. కానీ, ఇది అంతకన్నా విచిత్రమైన విషయం. ఓ చేపకు రెండు నోర్లు ఉన్నాయి. ఈ ఫోటోను షేర్ చేయగానే అది నిమిషాల్లో 6 వేలకు పైగా షేర్లను, వేల సంఖ్యలో కామెంట్లనూ తెచ్చుకుంది.

ఇదో ఆశ్చర్యకరమైన జీవని, చాంప్లెయిన్ సరస్సులో పెరిగి ఉండవచ్చని, ఈ చేపను పట్టిన డెబియీ జీడీసెస్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆయన వేట నిమిత్తం సరస్సుకు వెళ్లినప్పుడు ఇది వలకు చిక్కింది. దీన్ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ చేపకు రెండు తలలు ఉన్నాయి. నాలుగు కళ్లు లేవుగానీ, రెండు నోర్లు ఉన్నాయి. ఈ చేపను మీరూ చూడవచ్చు.

More Telugu News