కెమికల్‌ పౌడర్‌ లోడ్‌తో వెళ్తున్న లారీకి ప్రమాదం.. డ్రైవర్‌, క్లీనర్‌ సజీవ దహనం

  • విజయనగరం జిల్లా గుడివాడ గ్రామం వద్ద ఘోరం
  • ప్రమాదానికి గురై 26వ నంబరు జాతీయ రహదారిపై నిలిచిన ఓ లారీ
  • అదే లారీని కెమికల్‌ లోడు లారీ ఢీకొట్టడంతో ఘటన
కెమికల్‌ పౌడర్‌ లోడుతో వెళ్తున్న ఓ లారీ ఆగివున్న మరో లారీని ఢీకొట్టిన ప్రమాదంలో మంటలు చెలరేగి డ్రైవర్‌, క్లీనర్‌ సజీవ దహనమయ్యారు. 26వ నంబరు జాతీయ రహదారిపై విజయనగరం జిల్లా గజపతినగరం సమీపంలో ఈరోజు తెల్లవారు జామున ఈ ఘోరం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గజపతినగరం మండలం గుడివాడ గ్రామం వద్ద ఓ లారీ ప్రమాదం బారిన పడి నిలిచి పోయింది. ఈరోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఇదే రోడ్డులో విశాఖ నుంచి పార్వతీపురం వైపు కెమికల్‌ పౌడర్‌ లోడ్‌తో మరో లారీ వెళ్తోంది. గుడివాడ వద్ద ఆగివున్న లారీని గుర్తించని కెమికల్ పౌడర్ లారీ డ్రైవర్ వెనుక నుంచి దాన్ని బలంగా ఢీకొట్టాడు.

ఈ ఘటనలో కెమికల్‌ లారీలో మంటలు చెలరేగి డ్రైవర్‌ రామచందర్‌యాదవ్‌ (40), క్లీనర్‌ ప్రకాష్‌ సింగ్‌(30)  సజీవదహనమయ్యారు. బాధితులు ఇద్దరూ మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం కారణంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.  స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
Go Back to Shorts
Road Accident
two lorries collued
fire broken out
two burnt alive

More Telugu News