RBI: కొత్త నిబంధన: మీ అనుమతి లేనిదే ఇకపై ఎవరూ మీ ఖాతాలో సొమ్ము జమచేయలేరు!

  • డబ్బు బట్వాడాకు ఖాతాదారు అనుమతి తప్పనిసరి
  • అక్రమ జమలు లేకుండా చూసేందుకే
  • రిజర్వ్ బ్యాంక్ ముందు కేంద్రం ప్రతిపాదనలు

మీ బ్యాంకు ఖాతాలోకి ఎవరైనా ఆన్‌ లైన్‌ లో డబ్బు పంపించాలంటే, ఇకపై సదరు ఖాతాదారు అనుమతి తప్పక తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోనుంది. నగదు బదిలీ విధానంలో నేరుగా సొమ్ము జమ చేయాలంటే ఇకపై సంబంధిత ఖాతాదారు అనుమతి తప్పకుండా తీసుకోవాలి. ఇప్పటివరకు ఖాతాదారు ఎకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, లేదా ఫోన్ నంబర్ తదితరాలు తెలిస్తే, ఆన్‌ లైన్‌ లో డబ్బును బదిలీ చేయవచ్చన్న సంగతి తెలిసిందే.

అయితే, నోట్ల రద్దు సమయంలో చాలా మంది ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతాల్లో పలువురు తమ నల్ల డబ్బును వేశారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, మరోమారు ఇటువంటివి జరుగకుండా చూసేందుకు ఈ నిబంధన తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ, రిజర్వు బ్యాంకును అభిప్రాయం చెప్పాలని కోరింది. ఇక రిజర్వు బ్యాంకు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే కొత్త నిబంధన అమల్లోకి రానుంది. నిర్ణీత సమయంలోగా బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ కు స్పందిస్తేనే, ఖాతాలో డబ్బు చేరుతుంది. అందుకు కూడా కనీస చార్జ్ ని వసూలు చేయడం ద్వారా బ్యాంకులకు నష్టం కలుగకుండా చూసుకోవాలని కేంద్రం భావిస్తోంది.

More Telugu News