pm: మోదీ, అమిత్ షాలను సంప్రదించాకే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • అవినీతిని అడ్డుకోవాలన్నది మా సంకల్పం
  • మా సంకల్పానికి మోదీ, అమిత్ ఆశీస్సులు ఉన్నాయి
  • ఏపీలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది
ఏపీ సీఎం జగన్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అడ్డుకునే విషయంలో తమ సంకల్పానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని, వాళ్లిద్దరినీ సంప్రదించాకే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రివర్స్ టెండర్లు, గత ప్రభుత్వంలోని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) గురించి ప్రస్తావించారు. మోదీతో మాట్లాడాకే వీటిపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఏపీలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానాను దోచుకుందని, వారందరినీ చట్ట పరిధిలోకి తీసుకురావాలనేదే తమ దృఢసంకల్పమని పేర్కొన్నారు.
pm
modi
Home minister
Amitshah
vijayasai

More Telugu News