B.K.Eeshwar: తనకి టిఫిన్ సరిపోవడం లేదని బీఎన్ రెడ్డిగారికి చెప్పిన ఎన్టీఆర్: సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్

  • మొదటి నుంచి సినిమాలంటే ఆసక్తి 
  • విజయచిత్రలో ఉద్యోగం సంపాదించాను 
  • ఆ స్టూడియో మరో ప్రపంచంలా అనిపించేదన్న ఈశ్వర్

రచయితగా .. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా బీకే ఈశ్వర్ కి అపారమైన అనుభవం వుంది. తాజాగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్ట్ గా తొలినాళ్లలో తనని ఆశ్చర్యపరిచిన విషయాలను గురించి ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా నాకు సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. ఆ ఉత్సాహమే నాకు 'విజయ చిత్ర' పత్రిక ఆఫీసులో ఉద్యోగం లభించేలా చేసింది. దాంతో నేను విజయ వాహిని స్టూడియోలోకి ఎప్పుడంటే అప్పుడు వెళ్లేవాడిని.

తొలిసారిగా విజయ వాహినిలోకి వెళ్లినప్పుడు మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా అనిపించింది. అంతకుముందు ఆ స్టూడియోలో ఏయే సినిమాల షూటింగులు జరిగాయో తెలుసుకుంటూ వుంటే ఎంతో ఆనందంగా అనిపించేది. నెలకి 500 రూపాయల జీతం తీసుకుంటూ ఎన్టీఆర్ ఆ బ్యానర్ పై సినిమాలు చేసేవారట. ఆ బ్యానర్ పై నిర్మితమవుతోన్న సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులందరికీ అక్కడి క్యాంటీన్లోనే టిఫిన్ పెట్టేవారు. అయితే ఎన్టీఆర్ కి ఆ టిఫిన్ సరిపోయేది కాదట. ఆ విషయాన్ని ఆయన నాగిరెడ్డిగారికి చెప్పడంతో, ఆయన నవ్వేసి .. టిఫిన్ సెక్షన్ కి సంబంధించిన ఇన్చార్జ్ ను పిలిచి, ఎన్టీఆర్ గారికి ఎంత అడిగితే అంత పెట్టమని చెప్పారట. ఈ విషయాలన్నీ నాకు అప్పట్లో అక్కడ పనిచేస్తోన్న సీనియర్ లైట్ మెన్ ఒకరు చెప్పారు" అని అన్నారు.

  • Loading...

More Telugu News