Shiva: రజనీ తదుపరి సినిమా ఆ దర్శకుడితో?

  • అజిత్ కి వరుస హిట్స్ ఇచ్చిన శివ 
  • శివతో సినిమా చేయాలనే ఆసక్తితో సూర్య 
  • రజనీతో శివ సినిమా వుండనుందంటూ టాక్    

ప్రస్తుతం రజనీకాంత్ .. మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' సినిమా చేస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో రజనీ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. 'పేట' హిట్ తరువాత రజనీ చేస్తోన్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు వున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా 'శివ' దర్శకత్వంలో వుండనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వరుసగా అజిత్ సినిమాలు చేస్తూ .. విజయాలను అందుకుంటూ దర్శకుడిగా శివ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ కారణంగానే ఆయనతో సినిమా చేయడానికి హీరో సూర్య ఉత్సాహాన్ని చూపుతున్నాడనేది కోలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ తో శివ సినిమా వుండనుందనే వార్త షికారు చేస్తోంది. ఈ ఇద్దరు హీరోల్లో ముందుగా శివ ఎవరితో కలిసి సెట్స్ పైకి వెళతాడో చూడాలి మరి.

More Telugu News