Anushka Shetty: అనుష్కతో కలసి అమెరికాలో ఇంటి కోసం వెతుకుతున్నాడనే వార్తలపై ప్రభాస్ స్పందన

  • అనుష్క నాకు చాలా కాలంగా తెలుసు
  • అందరూ అనుకుంటున్నట్టు మా మధ్య ఏమీ లేదు
  • ఏదైనా ఉంటే ఇంత కాలం దాచి పెట్టలేము
హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఇప్పటికే చాలా సార్లు వచ్చాయి. తాజాగా వీరి గురించి మరో వార్త వైరల్ అవుతోంది. ఇద్దరూ కలసి అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఇంటి కోసం వెతుకున్నారనేదే ఆ వార్త. ముఖ్యంగా ముంబై ఎంటర్ టైన్ మెంట్ మీడియా ఈ విషయాన్ని హైలైట్ చేస్తోంది. ఇదే విషయంపై ప్రభాస్ ను 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రశించగా... అలాంటిదేమీ లేదని బదులిచ్చాడు. జనాలు తాను చెప్పేది వినకపోతే... తాను చేసేదేమీ లేదని అన్నాడు. అనుష్క తనకు చాలా కాలం నుంచి తెలుసని... అయితే, అందరూ అనుకుంటున్నట్టు తమ మధ్య ఏమీ లేదని చెప్పాడు.

అనుష్కకు, తనకు మధ్య ఏమైనా ఉంటే ఇద్దరం కలసి గత రెండేళ్లలో ఎక్కడో ఒకచోట మీడియా కంటికి చిక్కేవారమని ప్రభాస్ అన్నాడు. తామిద్దరం కలసి ఎక్కడా కనిపించలేదు కదా... అందుకే ఇదొక రూమర్ అని చెప్పాడు. ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే ఇంత కాలం దాచి ఉంచడం సాధ్యపడే విషయం కాదని అన్నాడు. ఇలాంటి పుకార్లు ఎలా వస్తాయో తనకు అర్థం కావడం లేదని చెప్పాడు. ఎవరితోనైనా అఫైర్ ఉండాలనో... లేక ఏదో ఒక అమ్మాయితో తనకు సంబంధం ఉందనే విషయాన్ని తన నుంచి వినాలనో జనాలు అనుకుంటున్నట్టున్నారని... అది జరగక పోవడంతో ఎవరితోనో తనకు సంబంధాన్ని ముడిపెట్టేస్తున్నారని ఛలోక్తి విసిరాడు.
Anushka Shetty
Prabhas
House
Los Angeles
Affair
Tollywood
Bollywood

More Telugu News