Pasupuleti Brahmaiah: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూత!

  • నిన్న రాత్రి గుండెపోటు
  • ప్రథమచికిత్స అనంతరం హైదరాబాద్ కు తరలింపు
  • మార్గమధ్యంలోనే పోయిన ప్రాణాలు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన బ్రహ్మయ్య పార్టీలో పలు కీలక పదవులు నిర్వహించారు. గత రాత్రి ఆయనకు గుండెపోటు రాగా, స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ కు తరలించాలని వారు సూచించడంతో, అంబులెన్స్ లో తీసుకు వస్తున్న వేళ, మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు విడిచారు. హైదరాబాద్ శివార్లలోని ఓ ఆసుపత్రికి బ్రహ్మయ్యను తీసుకురాగా, అప్పటికే ఆయన ప్రాణాలు పోయాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. బ్రహ్మయ్య మృతిపై పార్టీ శ్రేణులు సంతాపాన్ని వెలిబుచ్చాయి.
Pasupuleti Brahmaiah
Passes Away
Telugudesam
Condolence

More Telugu News