River godavari: గోదావరికి మళ్లీ వరద వచ్చే అవకాశం: ఆర్‌టీజీఎస్

  • నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు
  • గోదావరి తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
  • కృష్ణా వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ
నేటి నుంచి మూడు రోజులపాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) తెలిపింది. ఫలితంగా గోదావరికి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. నదీ తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, కృష్ణానదికి ఇటీవల వచ్చిన వరదలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆయా ప్రాంతాల్లో బాధితులకు ఒక్కో కుటుంబానికి  25 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్‌, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్‌, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు ఇవ్వనున్నట్టు పేర్కొంది.

River godavari
Andhra Pradesh
RTGS

More Telugu News