Andhra Pradesh: ఏపీలో ప్రధానమైన కమ్యూనిటీపై కక్ష గట్టారు: వైసీపీపై వర్ల ఫైర్

  • ఆ కమ్యూనిటీని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు
  • రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి వీల్లేదు
  • రాజధాని తరలిస్తారన్న వార్తలు ఇప్పుడే ప్రచారం చేయొద్దు
ఏపీ రాజధాని అమరావతిపై త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజధాని ఇక్కడి నుంచి తరలిపోతుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీ నేత వర్ల రామయ్య స్పందిస్తూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఏపీలో ప్రధానమైన కమ్యూనిటీపై కక్ష గట్టారని, ఆ కమ్యూనిటీని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఆలోచన కరెక్టు కాదని, వైసీపీ సర్కార్ చేతులు కాల్చుకోవడం ఖాయమని అన్నారు. అసలు, రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి వీల్లేదని, అది కరెక్టు కాదని అన్నారు. రాజధానిని ఎలా మారుస్తారు? అధికారంలో ఉన్నారని వాళ్ల ఇష్టమొచ్చినట్టు చేస్తారా? అమరాతివకి అసెంబ్లీ, హైకోర్టు వచ్చాయని, బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతుంటే ఎలా మారుస్తారు? అని ప్రశ్నించారు. రాజధానిని తరలిస్తారన్న వార్తలను ఇప్పుడే ప్రసారం చేయొద్దని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని మీడియాకు విజ్ఞప్తి  చేస్తున్నానని అన్నారు.
Andhra Pradesh
Amaravathi
YSRCP
Telugudesam
varla

More Telugu News