Raavi Kondala Rao: 'పెళ్లి పుస్తకం' కథ ఇలా చెప్పగానే బాపూ రమణల గారికి అలా నచ్చేసింది: రావి కొండలరావు

  • బాపూ రమణలతో మంచి స్నేహం వుంది
  • నేను చెప్పిన కథే 'పెళ్లి పుస్తకం'
  • మా ముగ్గురికి నంది అవార్డులు తెచ్చిపెట్టిందన్న రావి కొండలరావు  

తాజా ఇంటర్వ్యూలో రావి కొండలరావు మాట్లాడుతూ 'పెళ్లి పుస్తకం' సినిమాను గురించి ప్రస్తావించారు. "బాపూ - రమణల గారితో నాకు మంచి సాన్నిహిత్యం వుంది. ఓసారి ఇద్దరు స్నేహితులకి సంబంధించిన కథను వాళ్లు వండుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్లను కలిసిన నేను, నా దగ్గర ఒక కథ వుంది అని చెప్పాను. 'అయితే చెప్పండి' అన్నారు. దాంతో అప్పుడే కథ చెప్పేశాను.

మరునాడు పొద్దున్నే బాపూ గారు నాకు కాల్ చేసి, ఈ కథను మనం సినిమా తీస్తున్నాము అని అన్నారు. ఓ పదిహేను ఇరవై రోజులు కథా చర్చలకు వచ్చేయండి అని చెప్పారు. వాళ్లకి బాగా నచ్చిన ఆ కథే 'పెళ్లి పుస్తకం'. ఉత్తమ కథా రచయితగా నాకు .. ఉత్తమ మాటల రచయితగా రమణ గారికి .. ఉత్తమ దర్శకుడిగా బాపూ గారికి ఈ సినిమా నంది అవార్డులను తెచ్చిపెట్టింది. ఇలా ఓకే వేదికపై మేము ఒకే సినిమాకి వరుసగా అవార్డులు అందుకోవడం విశేషం" అని చెప్పుకొచ్చారు.

More Telugu News