ప్రియుడిపై కోపంతో అతని ఇంటికి నిప్పుపెట్టిన ప్రియురాలు!
- అమెరికాలోని న్యూజెర్సీలో ఘటన
- అర్ధరాత్రి ఇంటికి రమ్మని పిలిచిన యువకుడు
- యువతి రాగా తలుపు తీయని వైనం
కానీ అప్పటికే పూటుగా మద్యం సేవించిన యువకుడు నిద్రలోకి జారుకున్నాడు. ఇంటి దగ్గరకు వచ్చిన రస్సెల్ 8 సార్లు ఫోన్ చేసింది. రెండు సార్లు సందేశాలు పంపింది. అయినా యువకుడు గుర్రుపెట్టి నిద్రపోయాడు. దీంతో సహనం కోల్పోయిన రస్సెల్ దగ్గర్లోని ఓ పెట్రోల్ బంక్ కు వెళ్లింది. ఓ బాటిల్ నిండా పెట్రోల్ తో పాటు అగ్గిపెట్టె, లైటర్ ను కొనుగోలు చేసింది. అనంతరం యువకుడి ఇంటిపై చల్లి, నిప్పు పెట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైంది.
అయితే మంటల వేడికి ఉదయం 4.30 గంటల సమయంలో మేలుకున్న యువకుడు కిటికీని పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సందర్భంగా అతనికి కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో యువకుడి ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా, అగ్నిమాపక సిబ్బంది ఇంట్లోని శునకాన్ని కాపాడారు. మరోవైపు యువతి రస్సెల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.