Sye Raa Narasimha Reddy: ‘చరిత్రలో మనం ఉండకపోవచ్చు.. చరిత్ర మనతోనే మొదలవ్వాలి’... ‘సైరా’ టీజర్ విడుదల!

  • విడుదల చేసిన హీరో రామ్ చరణ్
  • చిరంజీవి సరసన నయనతార
  • అక్టోబర్ 2న విడుదలకు నిర్మాతల సన్నాహాలు

మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 'సైరా' టీజర్  ఈరోజు విడుదలైంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు వంటి హేమాహేమీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా టీజర్ ను కొణిదెల ప్రొడక్షన్స్ విడుదల చేసింది. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్భంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేసే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.. మెగాస్టార్ యాక్షన్ సీన్లతో ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ టీజర్ నూ మీరూ చూసేయండి.

More Telugu News