jayasudha: నాతో మాట్లాడిన ఫస్టు హీరో శోభన్ బాబు గారు: జయసుధ

  • హీరోయిన్ గా అప్పుడప్పుడే గుర్తింపు వస్తోంది 
  • విజయవాహిని స్టూడియోలో శోభన్ బాబుగారిని చూశాను 
  • నా గురించి ఆయనకి కైకాల సత్యనారాయణగారు చెప్పారట     
తెలుగు తెరపై నిన్నటితరం కథానాయికగా జయసుధ ఒక వెలుగు వెలిగారు. ఎన్టీఆర్ .. ఏ ఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు వంటి అగ్రకథానాయకుల సరసన కథానాయికగా మెప్పించి సహజనటిగా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.

తాజా ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ .. "చెన్నైలోని విజయ వాహిని స్టూడియోలో నేను ఒక సినిమా షూటింగులో వున్నాను. అప్పటికి 'లక్ష్మణ రేఖ' .. 'జ్యోతి' సినిమాలు విడుదలయ్యాయి. విజయ వాహిని స్టూడియోలో మరో పక్కన శోభన్ బాబుగారి షూటింగు జరుగుతోంది. షూటింగు గ్యాపులో ఆయన తన మేకప్ రూముకి వెళుతూ నన్ను చూసి ఆగారు.

ఆయనను దగ్గరగా చూడటం అదే ఫస్టు టైమ్. వెంటనే లేచి 'నమస్కారం సార్' అన్నాను. 'నీ గురించి నాకు కైకాల సత్యనారాయణగారు చెప్పారు. నువ్వు మంచి నటివి అవుతావనీ, నీకు మంచి భవిష్యత్తు వుందని ఆయన నాతో అన్నారు .. ఇప్పుడు నిన్ను చూస్తున్నాను .. సంతోషం' అంటూ ఆయన నవ్వుతూ మాట్లాడారు" అని చెప్పుకొచ్చారు.
jayasudha
Sobhan Babu

More Telugu News