Jeffrey Epstein: రూ. 4 వేల కోట్ల ఆస్తికి వీలునామా రాసి.. ఆత్మహత్య చేసుకున్న ఖైదీ!

  • మన్ హటన్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న ఫైనాన్సియర్ జెఫ్రీ ఎప్ స్టీన్
  • ఆత్మహత్యకు రెండు రోజుల ముందు వీలునామా
  • ఓ ట్రస్టు పేరిట వీలునామా రాసిన జెఫ్రీ
జెఫ్రీ ఎప్ స్టీన్... అమెరికాలో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక ఫైనాన్సియర్. కొన్ని రోజుల క్రితం యూఎస్ లోని మన్ హటన్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ అమ్మాయిలను లైంగికంగా వేధించిన కేసులో ఆయన గత జూలై నుంచి జైల్లో ఉంటున్నాడు. అయితే, అతను ఉరివేసుకుని చనిపోవడానికి రెండు రోజుల ముందే వీలునామా రాశాడని న్యూయార్క్ పోస్ట్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. దాదాపు 577 మిలియన్ డాలర్లు... అంటే, మన కరెన్సీలో దాదాపు రూ. 4 వేల కోట్ల ఆస్తిని ఓ ట్రస్తు పేరిట జెఫ్రీ వీలు నామా రాశాడని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. ఈ కథనం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మరోవైపు, నష్టపరిహారం కోసం కోర్టులో పోరాడుతామని జెఫ్రీ బాధితులు పేర్కొంటున్నారు.
Jeffrey Epstein
Sucide
Will
USA

More Telugu News