IPS officer: డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు.. మాజీ ఐపీఎస్ అధికారికి 15 ఏళ్ల జైలు శిక్ష

  • 2009లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన మాజీ ఐపీఎస్ మోహన్
  •  ఆయన డ్రైవర్‌కు పదేళ్ల జైలు శిక్ష
  • ముంబై వ్యాపారవేత్త ఒబెరాయ్‌ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

2009 నాటి డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సాజీ మోహన్‌, ఆయన డ్రైవర్/కానిస్టేబుల్ రాజేశ్ కటారియాలను ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. మోహన్‌కు 15 ఏళ్లు, రాజేశ్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది.  మరో నిందితుడు, ముంబై వ్యాపారవేత్త విక్కీ ఒబెరాయ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

17 జనవరి 2009లో ఒబెరాయ్, కటారియాలను ముంబై ఓషివారా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 37.850 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల తర్వాత హెరాయిన్ బ్యాగుతో సాజీమోహన్ పట్టుబడ్డారు. చండీగఢ్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్‌గా ఉన్న సాజీ మోహన్ అక్కడి నుంచే డ్రగ్స్ తీసుకొచ్చే వారని పోలీసులు తెలిపారు. ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ డిమాండ్ చేసింది. వాదోపవాదాలు విన్న కోర్టు ఆయనకు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

More Telugu News