వచ్చే ఐదేళ్లలో ఎస్బీఐ డెబిట్ కార్డులు గల్లంతు: ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్
- దేశంలో ప్రస్తుతం 93 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు
- యోనో యాప్ సేవలను విస్తృతం చేయనున్న ఎస్బీఐ
- క్రెడిట్ కార్డుతోనూ పని ఉండదన్న రజనీశ్ కుమార్
యోనో యాప్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, దీని సాయంతో ఏటీఎం నుంచి నగదును విత్డ్రా చేసుకోవచ్చని, కార్డుతో పనిలేకుండానే దుకాణాల్లో చెల్లింపులు చేసుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం 68 వేలుగా ఉన్న యోనో కేంద్రాల సంఖ్యను మరో ఏడాదిన్నరలో పది లక్షలకు చేరుస్తామన్నారు. అప్పుడు కార్డుతో ఇక అవసరమే ఉండదని రజనీశ్ పేర్కొన్నారు. యోనో యాప్ ద్వారా కొన్ని వస్తువుల కొనుగోలుకు రుణం కూడా లభిస్తుందని, అప్పుడిక క్రెడిట్ కార్డుతో పనే ఉండదన్నారు. వచ్చే ఐదేళ్లలో కార్డు వినియోగం గణనీయంగా తగ్గుతుందని రజనీశ్ పేర్కొన్నారు.