bigboss: బిగ్‌బాస్: అందరికీ బాబా భాస్కరే టార్గెట్.. భావోద్వేగంతో కంటతడి

  • నామినేషన్ కోసం అలీ చేసిన ఆరోపణలు బాధించాయన్న బాబా భాస్కర్
  • శ్రీముఖితో చెబుతూ కన్నీరు
  • ఒకరినొకరు ఎలిమినేట్ చేసుకున్న పోటీదారులు
స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ రియాలిటీ షో రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటి వరకు హౌస్‌లో నవ్వుతూ, నవ్విస్తూ సందడి చేసిన బాబా భాస్కర్ కన్నీరుపెట్టుకున్నాడు. హౌస్‌లో ఉన్న పోటీదారులు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా ఎక్కువమంది రాహుల్‌ను నామినేట్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో  హిమజ నిలిచింది. మొత్తంగా ఈ వారంలో రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

హౌస్‌లో ఎప్పుడూ సందడిగా ఉండే బాబా భాస్కర్ గతరాత్రి మాత్రం కన్నీరు పెట్టుకున్నాడు. నామినేషన్ సందర్భంగా హౌస్‌మేట్స్ తనపై చేసిన ఆరోపణలు భాస్కర్‌ను బాధించాయి. తాను ఎప్పుడూ ఒకలాగే ఉంటానని, బిగ్‌బాస్ షో కోసం నటించాల్సిన పనిలేదని చెప్పుకొచ్చాడు. తనను నామినేట్ చెసేందుకు అలీ చెప్పిన కారణం తనను బాధించిందని శ్రీముఖికి చెబుతూ వెక్కివెక్కి ఏడ్చాడు. తాను అందిరితోనూ ఒకేలా ఉంటానని పేర్కొన్నాడు.
bigboss
star maa
baba bhaskar
Nagarjuna

More Telugu News