Kurnool District: శ్రీశైల ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తిపై బదిలీ వేటు..కొత్త ఈవో నియామకం!

  • శ్రీశైల దేవస్థానంలోని దుకాణాల వేలంపాటపై ఆరోపణలు
  • శ్రీరామచంద్రమూర్తిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు
  • సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
శ్రీశైల దేవస్థానంలోని లలితాంబిక వాణిజ్య సముదాయంలో దుకాణాలకు ఇటీవల జరిగిన వేలంపాటపై ఆరోపణలు తలెత్తడంతో ఆ వేలంపాటను రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం కొన్ని గంటల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, మరో నిర్ణయం తీసుకుంది. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునప్వామి వారి దేవస్థానం ఆలయ ఈవో ఎ.శ్రీరామచంద్రమూర్తిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆయన్ని ఆదేశించింది. కాగా, ఆలయ కొత్త ఈవోగా డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన కేఎస్ రామారావును ప్రభుత్వం నియమించింది.
Kurnool District
Eo
Srirama chandra murthy

More Telugu News