Cable: తగ్గనున్న కేబుల్, డీటీహెచ్ ధరలు!

  • కొన్నాళ్ల కిందట కొత్త విధానం తీసుకువచ్చిన కేంద్రం
  • చానళ్ల ధరలు సమీక్షించాలంటూ టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశం
  • సెప్టెంబరు 16 లోపు ధరల తగ్గింపుపై అభిప్రాయాలు వెల్లడించాలంటూ గడువు

దేశంలో కేబుల్ ప్రసారాలు డిజిటలైజ్ చేసిన తర్వాత వినియోగదారులు నాణ్యమైన టీవీ ప్రసారాలు చూసే వీలు కలిగింది. అయితే, కేంద్రం కొన్నాళ్ల కిందట తీసుకువచ్చిన నూతన విధానం వినియోగదారులకు భారంగా మారింది. అనేక చానళ్ల రుసుములు పెరిగిపోయాయి. దాంతో నెలవారీ బిల్లులు చూసి కస్టమర్లు బెంబేలెత్తిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో, దేశంలోని కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు ఊరట కలిగించేలా ట్రాయ్ రంగంలోకి దిగింది. టెలికాం కంపెనీలు చానెల్ ధరలు, బొకే చార్జీలను మరోసారి సమీక్షించాలంటూ ట్రాయ్ ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబరు 16 లోగా ధరల తగ్గింపుపై అభిప్రాయాలు, ప్రతిపాదనలు వెల్లడించాలని స్పష్టం చేసింది.

More Telugu News