Prabhas: 'సాహో' నుంచి 'బ్యాడ్ బాయ్' సాంగ్ వచ్చేసింది

  • 400 కోట్ల బడ్జెట్ తో రూపొందిన 'సాహో'
  • వివిధ భాషల్లో భారీస్థాయి రిలీజ్ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న అంచనాలు          

సుజిత్ దర్శకుడిగా ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'సాహో' ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'బ్యాడ్ బాయ్' అంటూ సాగే సాంగును విడుదల చేశారు. ప్రభాస్ .. జాక్విలిన్ ఫెర్నాండేజ్ కాంబినేషన్ పై చిత్రీకరించిన ఈ పాట యూత్ కి నచ్చేలా వుంది.

ప్రభాస్ చాలా స్టైలీష్ గా కనిపిస్తూ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, ప్రభాస్ సరసన నాయికగా శ్రద్ధా కపూర్ నటించింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆయా భాషలకి చెందిన నటీనటులు ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అంతకంతకూ అంచనాలు పెంచేస్తూ వెళుతోంది.

More Telugu News