Andhra Pradesh: గవర్నర్ చాలా పాజిటివ్ గా స్పందించారు: టీడీపీ నేత అచ్చెన్నాయుడు

  • బాబు నివాసంపై డ్రోన్‌ ఎగరడంపై గవర్నర్ కు ఫిర్యాదు
  • అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామని చెప్పారు
  • మా వాళ్లపై అన్యాయంగా కేసులు పెట్టారు
తమ అధినేత చంద్రబాబునాయుడి నివాసంపై డ్రోన్‌ ఎగురవేయడాన్ని నిరసిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం, మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, గవర్నర్ చాలా పాజిటివ్ గా స్పందించారని, ఈ విషయాలన్నింటినీ ఒక మెమొరాండం రూపంలో ఆయనకు అందజేశామని, అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామని చెప్పారని అన్నారు.

అనామకులైనటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై డ్రోన్లతో వీడియోలు తీస్తుంటే దీన్ని ప్రతిఘటించిన తమ నాయకులు, కార్యకర్తలపై అన్యాయంగా ఏడు కేసులు పెట్టారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తాము కూడా ప్రైవేట్ కేసులు వేయబోతున్నామని, ఈ కేసుల్లో ముఖ్యమంత్రి పేరును కూడా చేర్చబోతున్నామని పేర్కొన్నారు.
Andhra Pradesh
Governer
Telugudesam
Atchanaidu

More Telugu News