Bhanumathi: భానుమతిగారి పెళ్లికి ఆమె తండ్రి అందుకే ఒప్పుకోలేదట: సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్

షార్ట్స్‌లో చూడండి
భానుమతి జీవితచరిత్రను 'నాలో నేను' పేరుతో రాసిన రచయిత .. సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, ఆమె రామకృష్ణ ప్రేమలో పడిన విషయాన్ని గురించి ప్రస్తావించారు. 'కృష్ణప్రేమ' సినిమాకి రామకృష్ణ అసోసియేట్ డైరెక్టర్. ఆ సినిమా షూటింగులో భానుమతి ఆయనపై మనసు పారేసుకున్నారట. భానుమతి అప్పటికే పెద్ద స్టార్ కావడంతో ఆమెకి ఆయన దూరం దూరంగా ఉండేవారు. ఆయనతో మాట్లాడటానికి ఆమె ఆరాటపడేవారు. ఆయనకేమో మొహమాటం ఎక్కువ.

ఓ రోజున ఆమె రామకృష్ణగారి గదికి వెళ్లి ఆయన పట్ల తన ప్రేమను వ్యక్తం చేశారు. అప్పటికి భానుమతి జీతం నెలకి రెండు వేలు అయితే, ఆయన జీతం నెలకి నూటా యాభై. అందువలన వీరి పెళ్లికి భానుమతి తండ్రి ఒప్పుకోలేదట. అయినా భానుమతి .. రామకృష్ణనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, తాను అనుకున్నది సాధించారు. 'నాలో నేను' పుస్తకం కోసం ఈ విషయాలను నాతో ఆమె పంచుకున్నారు" అని బీకే ఈశ్వర్ చెప్పుకొచ్చారు
Go Back to Shorts
Bhanumathi
B.K.Eeshwar

More Telugu News