Bhanumathi: అగ్రనటుల నెగెటివ్ షేడ్స్ ను కూడా భానుమతిగారు చెప్పేవారు: సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్

  • భానుమతి ఎంతో ప్రతిభావంతురాలు 
  • ఆమె ఆటో బయోగ్రఫీని 'నాలో నేను'గా రాశాను 
  • నెగెటివ్ విషయాలను తొలగించేవాడినన్న ఈశ్వర్  

రచయితగా .. సీనియర్ జర్నలిస్టుగా బీకే ఈశ్వర్ కి అపారమైన అనుభవం వుంది. తాజాగా ఆయన 'భానుమతి'ని గురించి ప్రస్తావించారు. "నటిగానే కాదు .. రచయితగా .. దర్శక నిర్మాతగా భానుమతిగారు ప్రతిభా పాటవాలను కనబరిచారు. 'చండీరాణి' సినిమాను తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను రూపొందించారు. ఆ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం.

భానుమతి గారిని ఒప్పించి 'విజయచిత్ర' పత్రికలో 'నాలో నేను' అనే పేరుతో ఆమె ఆటోబయోగ్రఫీ రాయడానికి సిద్ధమయ్యాను. ఆమె అగ్రనటుల గురించి మంచి విషయాలతో పాటు వాళ్లలోని నెగెటివ్ షేడ్స్ గురించి కూడా చెప్పేవారు. ఇబ్బంది కలిగించే ఆ విషయాలన్నీ రాయమనేవారు. 'వ్యక్తిగత విషయాలు వద్దు మేడమ్' అంటే వినిపించుకునేవారు కాదు. దాంతో అనవసరమైన వివాదాలను ఎదుర్కోవడం ఇష్టం లేక, నేను పాజిటివ్ విషయాలు మాత్రమే రాసి ప్రెస్ కి పంపించేవాడిని. తాను చెప్పిన నెగెటివ్ విషయాలు పత్రికలో లేకపోవడం చూసి ఆమె అడిగేవారు. ఆమెకి ఏదో ఒకటి చెప్పి శాంతింపజేసేవాడిని. ఆ పుస్తకానికి నేషనల్ అవార్డు రావడం ఆమెకి సంతోషాన్ని కలిగించింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News