Saaho: బాహుబలి తర్వాత ప్రభాస్ కథను నమ్మి సాహో చేయడం నాకు బాగా నచ్చింది: ఎస్ఎస్ రాజమౌళి

  • రామోజీ ఫిలింసిటీలో సాహో ప్రీరిలీజ్ ఈవెంట్
  • హాజరైన రాజమౌళి
  • ప్రభాస్ పై ప్రశంసలు
సాహో చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కూడా హాజరయ్యారు. ప్రభాస్ కు ఎంతో సన్నిహితుడిగా పేరుతెచ్చుకున్న రాజమౌళి ఈ సందర్భంగా తన అభిప్రాయాలు వెల్లడించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కథను నమ్మి సాహో చిత్రాన్ని చేయడం తనను బాగా ఆకట్టుకుందని తెలిపారు. సహజంగా ఓ పెద్ద సినిమా తీసిన తర్వాత పెద్ద దర్శకులతోనే తీయాలని భావిస్తారని, కానీ కథపై నమ్మకంతో సుజీత్ దర్శకత్వంలో నటించడం ప్రభాస్ కే చెల్లిందని అన్నారు.

బాహుబలి తర్వాత తన అభిమానులు ఇలాంటి కథనే ఇష్టపడతారని ప్రభాస్ భావించాడని, ధైర్యంగా ముందడుగు వేశాడని రాజమౌళి వివరించారు. అయితే, సాహో స్పాన్ చూసిన తర్వాత ఇంత పెద్ద కథను సుజీత్ డీల్ చేయగలడా అని చాలామంది సందేహించినా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత అవన్నీ పటాపంచలు అయ్యాయని అన్నారు.
Saaho
Rajamouli
Prabhas
Tollywood

More Telugu News