Krishna River: కృష్ణా వరదలు తగ్గుముఖం పట్టాయి: హోం మంత్రి సుచరిత

  • మరో రెండ్రోజుల్లో సాధారణ స్థితి నెలకొంటుందన్న హోంమంత్రి
  • పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామని వెల్లడి
  • గుంటూరు, కృష్ణా జిల్లాలు అధికంగా నష్టపోయాయని వ్యాఖ్యలు

కృష్ణా నదికి వరదలు తగ్గుముఖం పట్టాయని, మరో రెండ్రోజుల్లో ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొంటుందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. వరదల వల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అధిక నష్టం వాటిల్లిందని చెప్పారు. ​వరదల కారణంగా ఇద్దరు మరణించారని, గుంటూరు జిల్లాలో 53, కృష్ణా జిల్లాలో 34 గ్రామాలు వరదబారిన పడ్డాయని వివరించారు. ఈ రెండు జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. పంట నష్టం అంచనా వేసి బాధితులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News