Syraa: ఈ నెల 20న సైరా టీజర్ రిలీజ్... వెల్లడించిన రామ్ చరణ్

  • ఆగస్టు 20న సైరా టీజర్
  • సోషల్ మీడియాలో వెల్లడించిన రామ్ చరణ్
  • అక్టోబరు 2న విడుదల అవుతున్న సైరా!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం టీజర్ ఈ నెల 20న విడుదల చేయనున్నారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక టీజర్ గురించి రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మరో రెండ్రోజుల్లో సైరా టీజర్ రిలీజ్ అంటూ పేర్కొన్నారు. సైరా చిత్రం అక్టోబరు 2న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇటీవలే సైరా మేకింగ్ వీడియోతో అచ్చెరువొందిన ఫ్యాన్స్ కు ఎల్లుండి రిలీజయ్యే టీజర్ మరింత సంతోషం కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
Syraa
Chiranjeevi
Ramcharan
Teaser

More Telugu News