Chiranjeevi: మాంసాహారాన్ని వదిలేసి శాకాహారిగా మారిపోయిన మెగాస్టార్!

  • ఆరు పదుల వయసులోనూ చురుకుగా ఉన్న చిరంజీవి
  • రామ్ చరణ్ సూచనల మేరకు మాంసాహారం వదిలివేసిన మెగాస్టార్
  • ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటూ, వ్యాయామం చేస్తున్నానని వెల్లడి
ఆరు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో చురుకుగా ఉంటూ, యువ హీరోలతో పోటీ పడి నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఇటీవల తన కోడలు ఉపాసనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన ఆరోగ్యం, ఫిట్ నెస్ కు కారణాన్ని చెప్పారు. తాను ఒకప్పుడు ఇష్టమైన ఆహార పదార్ధాలను అన్నింటినీ లాగించేవాడినని, ఇప్పుడు మాత్రం మాంసాన్ని ముట్టకుండా, పూర్తి శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటున్నానని చెప్పారు. దీంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడమే, చురుకుదనానికి కారణమని అన్నారు. ఈ సూచనలను తన కుమారుడు రామ్ చరణ్ చెప్పాడని, తాను వాటిని పాటిస్తున్నానని తెలిపారు.
Chiranjeevi
Upasana
Vegetarian
Food

More Telugu News