KCR: బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై స్పందించిన విజయశాంతి!

  • కాంగ్రెస్ పార్టీని వీడబోను
  • పార్టీ మారే ఆలోచనేదీ లేదు
  • అధికార దుర్వినియోగం చేస్తున్న కేసీఆర్ సర్కారు
తాను బీజేపీలో చేరబోతున్నానని వచ్చిన వార్తలు అవాస్తవమని సినీ నటి, కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడబోనని అన్నారు. తాజాగా, హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, బీజేపీలో చేరనున్నానంటూ వచ్చిన వార్తలపై స్పందించారు. తనకు అటువంటి ఆలోచన లేదని చెప్పారు. తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కారు అధికార దుర్వినియోగం చేసేందుకు సిద్ధమవుతోందని నిప్పులు చెరిగారు. వార్డుల విభజనలో అవకతవకలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ ప్రభుత్వ బరితెగింపును బట్టబయలు చేశాయని అన్నారు.
KCR
Vijayashanti
BJP
Congress

More Telugu News