Kabool: కాబూల్ పెళ్లి వేడుకపై ఉగ్రవాదుల దాడి!

  • 40 మందికి పైగా మృతి
  • 100 మందికి పైగా గాయాలు
  • మూడు రోజుల వ్యవధిలో రెండో దాడి
అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతున్న వేళ, ఒంటికి బాంబులను అమర్చుకున్న ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఈ దాడిలో 40 మందికి పైగా మృతి చెందగా, 100 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికులు, జవాన్లు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. పెళ్లి వేడుకలో వందలాది మంది సంబరాలు జరుపుకుంటున్న వేళ, ఈ ఘటన జరిగింది. మూడు రోజుల వ్యవధిలో కాబూల్ లో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. 14వ తేదీన కూడా కాబూల్‌లో భద్రతా దళాలు లక్ష్యంగా తాలిబన్లు కారు బాంబుతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
Kabool
Terrorists
Sucide Attack
Died

More Telugu News