MS Dhoni: బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో, సైనిక దుస్తుల్లో... క్రికెట్ ఆడిన ధోనీ!

  • గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ
    జమ్మూకశ్మీర్ లో విధులు
    పిల్లలతో కలిసి సేదదీరిన ధోనీ
ప్రపంచకప్ టోర్నీ అనంతరం, సైన్యానికి సేవలందించేందుకు కశ్మీర్ చేరుకున్నధోనీ, లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో రెండు వారాల పాటు విధులను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, సరిహద్దుల్లో రేయనకా, పగలనకా కాపలా కాస్తున్న సైనికుల్లో ఒకడిగా మమేకమైపోయి, వారిలో స్ఫూర్తిని నింపారు. తాజాగా, లేహ్ లోని బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో పిల్లలతో కలిసి ధోనీ క్రికెట్ ఆడారు. సైనిక దుస్తుల్లోనే ధోనీ బ్యాటింగ్ చేయడం గమనార్హం. ఇక ఈ ఫోటోను ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తన అధికార ట్విట్టర్ ఖాతాలో పంచుకోగా, వైరల్ అయింది.
MS Dhoni
Army
Jammu And Kashmir
Cricket

More Telugu News