World Cup: వరల్డ్ కప్ ఓటమిని సెలక్షన్ కమిటీపైకి నెట్టేసిన రవిశాస్త్రి!

  • తాను కోరుకున్న ఆటగాళ్లను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయలేదన్న రవిశాస్త్రి
  • సెలెక్షన్ ప్రక్రియలో కోచ్ మాటకు విలువ ఇవ్వాలని సూచన
  • ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియకు కోచ్ ను కూడా పిలవాలంటూ విజ్ఞప్తి

ఇటీవలే ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ లో ఓటమిపాలవడం పట్ల రవిశాస్త్రి బీసీసీఐకి వివరణ ఇచ్చాడు. బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ, తాను కోరుకున్న ఆటగాళ్లను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయలేదని, తద్వారా జట్టు కూర్పు అనుకున్న విధంగా సాధ్యపడలేదని వెల్లడించాడు. ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో కోచ్ మాటకు కూడా విలువ ఉండాలని, సెలెక్షన్ కమిటీ సమావేశాలకు కెప్టెన్ మాత్రమే కాకుండా కోచ్ ను కూడా పిలవాలని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ కోసం తాను అనుకున్న ఆటగాళ్లు జట్టులో లేరని, ఓటమికి ఇదో కారణమని తెలిపాడు. ఇటీవలే శాస్త్రి పదవీకాలం పూర్తికాగా, మరోసారి ఈ ముంబైవాలాపైనే కపిల్ కమిటీ నమ్మకం ఉంచింది. మరో రెండేళ్లపాటు శాస్త్రి టీమిండియా ప్రధాన కోచ్ గా కొనసాగనున్నాడు.

More Telugu News