Jagan: జగన్ నాయకత్వంపై అమెరికాలో భారత రాయబారి వ్యాఖ్యలు

  • అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం
  • జగన్ కోసం విందు ఏర్పాటు చేసిన భారత రాయబారి హర్షవర్థన్
  • జగన్ విధానాలు ఏపీని వ్యూహాత్మక మార్గంలో పయనింపజేస్తున్నాయంటూ ప్రశంస

ఏపీ సీఎం వైఎస్ జగన్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన చిన్నకుమార్తెకు కాలేజి సీటు కోసం ఆయన అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ జగన్ బిజీగా ఉన్నారు. తాజాగా, వాషింగ్టన్ డీసీలో అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ ఏపీ సీఎం జగన్ కు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ నాయకత్వం అమోఘమని అభివర్ణించారు. అభివృద్ధి పట్ల జగన్ సంకల్పం, స్థిరమైన వైఖరి, పాలనలో పారదర్శకత రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నాయని అన్నారు. జగన్ పనితనం పెట్టుబడులను ఆకర్షిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో అమెరికాలో భారత దౌత్య అధికారులు ఎంతో కృషి చేశారని కొనియాడారు.

More Telugu News